- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాంస్కృతిక, సినిమాటిక్ ల్యాండ్ మార్కుల్లో ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాలో వివిధ కోర్సులు చేస్తున్న విద్యార్థుల సృజనాత్మకతను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశంసించారు.

దిశ, వెబ్‌డెస్క్: అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాలో వివిధ కోర్సులు చేస్తున్న విద్యార్థుల సృజనాత్మకతను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశంసించారు. శనివారం ఆయన అక్కినేని నాగార్జున, అమలలతో కలిసి కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా ఏఎన్ఆర్ ను గుర్తు చేసుకున్నారు. 1970ల కాలంలో ఆ ప్రాంతంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనప్పుడు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోలను ఎలా స్థాపించారో.. నేటికీ అదే స్థాయిలో అవి గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ హైదరాబాద్ లోని అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక, సినిమాటిక్ ల్యాండ్ మార్కుల్లో ఒకటిగా ఎలా ఎదిగిందో గుర్తు చేసుకుంటూ.. సంస్థ గొప్ప వారసత్వాన్ని ప్రశంసించారు. ప్రపంచ స్థాయిలో చలనచిత్ర విద్య ద్వారా ఈ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో నాగార్జున, అమల నాయకత్వం ఎంతో గొప్పదని కొనియాడారు.
అన్నపూర్ణ కళాశాల విద్యార్థులు రూపొందించిన రోల్ నంబర్ 52ని చూశానని, ఆ సినిమా గుండెలను తాకేలా ఉందని కితాబిచ్చారు. తెలంగాణ ఆర్థిక వృద్ధికి ప్రభుత్వ దార్శనికతను ఆయన హైలైట్ చేస్తూ.. “2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యంలో చిత్ర పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ భవిష్యత్తును నిర్మించడంలో చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి సీనియర్ సినీ దిగ్గజాల మద్దతు కోసం ఎదురుచూస్తున్నాం” అని అన్నారు.






