Bhatti Vikramarka: కొత్త రేషన్ కార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి క్లారిటీ

by Ramesh Naini |

రేషన్ కార్డులపై వస్తున్న విమర్శలపై మరోసారి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) క్లారిటీ ఇచ్చారు.

Bhatti Vikramarka: కొత్త రేషన్ కార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేషన్ కార్డులపై వస్తున్న విమర్శలపై మరోసారి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) క్లారిటీ ఇచ్చారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లుగా రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు (new ration cards) రేషన్ కార్డులు ఇస్తామని ఇందిరమ్మ ప్రభుత్వం మాట ఇచ్చిందని గుర్తుకుచేశారు. ఇక అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని భట్టి స్పష్టం చేశారు. గ్రామసభల్లో నిష్పక్షపాతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పుకొచ్చారు. లబ్ధిదారుల జాబితా ఎక్కడో తయారు కాదని, అన్ని గ్రామసభల్లోనే ఎంపిక అవుతాయని, వారి పేర్లను కూడా అక్కడే ప్రకటిస్తారని స్పష్టం చేశారు.

రైతాంగ సోదరులందరికీ రైతు భరోసా పథకం కింద ఈ నెల 26 నుంచి వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎటువంటి షరతులు లేకుండా పథకం ద్వారా రూ. 12 వేలు రైతు ఖాతాలో వేయనున్నట్లు తెలిపారు. అలాగే భూమి లేని వ్యవసాయ కూలీలు కనీసం 20 రోజులు పనిచేస్తున్న కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టినట్లు తెలిపారు. గ్రామసభల్లో సమాచారం సేకరించి అక్కడే అందరి సమక్షంలో పేర్లు ప్రకటిస్తారని వెల్లడించారు. ఇంకా ఎవరికైనా పథకం రాకపోతే అక్కడే గ్రామసభలో వెరిఫై చేసి పరిష్కరిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికి ఎటువంటి కన్ఫూజన్ ఉండవద్దని గ్రామసభలు కార్యక్రమం పెట్టినట్లు చెప్పారు.

ఇందిరమ్మ ఇండ్లకు కూడా గ్రామ సభలు పెడుతున్నారని తెలియజేశారు. వాటికి కమిటీలు ఉన్నాయని అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులుపై అధికారులు ఊరంత కమిటీలతో తిరిగి నిష్పక్షపాతంగా సర్వే చేస్తారని, ఆ తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేస్తారని అన్నారు. అప్పుడు లబ్ధిదారుల లిస్ట్ ప్రకటిస్తారని, పేర్లు రాని వారికి అక్కడే వారి సమస్య పరిష్కరిస్తారని అన్నారు.

Next Story