గురుకులాల్లో డిప్యుటేషన్లు రద్దు

by velandi.Saikiran |

రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో అమలులో ఉన్న డిప్యుటేషన్లను తక్షణమే రద్దు చేస్తున్నట్లు గురుకులాల కార్యదర్శి

గురుకులాల్లో డిప్యుటేషన్లు రద్దు
X

గురుకులాల్లో డిప్యుటేషన్లు రద్దు

తక్షణమే అమల్లోకి వస్తాయన్న గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి

ప్రత్యేక సిబ్బందికి మినహాయింపు కల్పించిన సెక్రటరీ

ఏ జోనల్ అధికారికి డిప్యుటేషన్, బదిలీ అధికారాలు లేవని స్పష్టం

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో అమలులో ఉన్న డిప్యుటేషన్లను తక్షణమే రద్దు చేస్తున్నట్లు గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి ఉత్తర్వులు జారీ చేశారు. గురుకులాల్లో విద్యాబోధన, పరిపాలనలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, కొన్ని ప్రత్యేక కేసులకు ఈ రద్దు నుండి మినహాయింపునిచ్చినట్లు పేర్కొన్నారు. అందులో ప్రభుత్వ కార్యక్రమాల అమలు, చేదోడు వాదోడు కోసం ప్రధాన కార్యాలయానికి డిప్యుటేషన్ సిబ్బంది, పరిపాలనా కారణాలపై బాలికల సంస్థల నుండి బాలుర సంస్థలకు బదిలీ అయిన సిబ్బంది.

ప్రీమియర్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ , ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, సైనిక్ స్కూల్‌లకు డిప్యుటేషన్ చేయబడిన సిబ్బందికి మినహాయింపు ఇచ్చారు. ఇకపై, ఎటువంటి జోనల్ అధికారి కూడా నిర్దేశిత విధాన నిబంధనలు, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించకుండా ఎటువంటి డిప్యుటేషన్ లేదా బదిలీ ఉత్తర్వులను జారీ చేయడానికి అధికారం లేదని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కేడర్‌లకు ఎటువంటి మినహాయింపు లేకుండా వర్తిస్తాయని సొసైటీ కార్యదర్శి డా. వి.ఎస్. అలగు వర్షిణి తెలిపారు. సంబంధిత అధికారులు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని సర్కులర్‌లో పేర్కొన్నారు.

Next Story