MLA కోమటిరెడ్డి క్యాంప్ ఆఫీస్ కూల్చివేత.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే! (వీడియో)

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-20 15:50:03  IST  )

మంత్రి పదవి ఆశిస్తున్న తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ముఖ్య నేతల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) ఒకరు.

MLA కోమటిరెడ్డి క్యాంప్ ఆఫీస్ కూల్చివేత.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పదవి ఆశిస్తున్న తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ముఖ్య నేతల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) ఒకరు. తనకు హోంమంత్రి పదవి కావాలని బహిరంగంగానే పలుమార్లు తన మనసులోని మాట బయపెట్టారు. ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వొద్దంటూ సొంత నేతలే అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు మంత్రి పదవి ఆలస్యమవడానికి వాస్తు దోషమే కారణమని భావించినట్లు తెలుస్తోంది. సోమవారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయాన్ని(Komatireddy Rajagopal Reddy Camp Office) కూల్చివేశారు. ఆ వెంటనే కొత్త కార్యాలయ నిర్మాణానికి పనులు కూడా ప్రారంభించారు.

ఇదిలా ఉండగా.. ఉమ్మడి నల్లగొండ నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌‌లు కూడా ఆశిస్తున్నారు. ఎవరికి వారు కేబినెట్‌లో తమ సామాజికవర్గానికి అన్యాయం జరిగిందని.. తమను కేబినెట్‌లోకి తీసుకొని న్యాయం చేయాలని అధిష్టానం వద్ద వాపోతున్నారు. ఇప్పటికే వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను కలిసి పైరవీలు కూడా చేస్తున్నారు. స్థానిక ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. మరి కేబినెట్‌లో చోటు దక్కించుకునే అదృష్టవంతుడు ఎవరో తెలియాలంటే అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

Next Story