లక్షెట్టిపేట మున్సిపాలిటీలో తీవ్ర విషాదం.. ఫలితాల వేళ బీజేపీ అభ్యర్థి మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-13 03:25:13  IST  )

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో విషాదం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే 10వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎల్లమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు.

లక్షెట్టిపేట మున్సిపాలిటీలో తీవ్ర విషాదం.. ఫలితాల వేళ బీజేపీ అభ్యర్థి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై ఫలితాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణంలో మంచిర్యాల (Machiryal) జిల్లా లక్షెట్టిపేట (Lakshettipet)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 10వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థిగా పోటీ చేసిన ఎల్లమ్మ (Yellamma) అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే, గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కౌంటింగ్ రోజే పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఫలితాల కోసం వేచి చూస్తున్న సమయంలో అభ్యర్థి మరణించారన్న వార్త తెలియడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

అయితే, అభ్యర్థి మృతి నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై గందరగోళం నెలకొంది. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థి మరణించినప్పటికీ, ఓట్ల లెక్కింపు యథావిధిగా కొనసాగనుంది. ఒకవేళ మరణించిన అభ్యర్థి ఎల్లమ్మ మెజారిటీ ఓట్లు వచ్చి విజయం సాధించినట్లయితే, ఆ గెలుపును అధికారులు ధృవీకరించినప్పటికీ అది అమల్లోకి రాదు. ఆ వార్డు స్థానాన్ని ‘ఖాళీ’గా ప్రకటించి, తదుపరి సమయంలో ఉప ఎన్నిక (By-election) నిర్వహిస్తారు. లేదా పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులు గెలిస్తే వారిని విజేతలుగా ప్రకటిస్తారు.

Next Story