Telangana DGP: తెలంగాణ డీజీపీ జితేందర్‌ ఇంట తీవ్ర విషాదం..

by Ramesh Naini |

తెలంగాణ డీజీపీ జితేందర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Telangana DGP: తెలంగాణ డీజీపీ జితేందర్‌ ఇంట తీవ్ర విషాదం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ డీజీపీ జితేందర్ (Telangana DGP Jitender) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డీజీపీ జితేందర్ తల్లి కృష్ణ గోయల్‌ (85) అనారోగ్యంతో కన్నుమూశారు. అనారోగ్య సమస్య కారణంగా ఆమెను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించగా.. ఇవాళ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక, రేపు (శనివారం) జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, డీజీపీ తల్లి మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.

Next Story