TG: అసెంబ్లీ, మండలిలో కీలక చర్చ

by Gantepaka Srikanth |

రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్నాయి.

TG: అసెంబ్లీ, మండలిలో కీలక చర్చ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పైన చర్చను సోమవారం అసెంబ్లీ, శాసన మండలిలో చేపడతారు. అసెంబ్లీలో రెండు బిల్లులు తెలంగాణ వైద్య విధాన పరిషత్ (రిపీల్) బిల్లును మంత్రి దామోదర్ రాజనర్సింహా, తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్​అపాయింట్ మెంట్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్​పాటర్న్ అండ్ పే స్ర్టక్చర్ మూడో సవరణ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు సభలో ప్రవేశ పెడతారు. ఉభయ సభలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని అసెంబ్లీలో స్పీకర్, శాసన మండలిలో చైర్మన్ చేపడతారు. ఉభయ సభల్లో రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు 2018-19 ఆర్ధిక సంవత్సర తెలంగాణ బేవరేజేస్ కార్పోరేషన్ 5వ వార్షిక నివేదికను సభలో ప్రవేశపెడతారు.

Next Story