అదృష్టం కంటే ముందే వచ్చిన మృత్యువు.. చనిపోయిన వ్యక్తికి మద్యం షాప్ లైసెన్స్

by Malleboina Mahesh |

నేటి సమాజంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న మనుషులకు అన్ని సార్లు అదృష్టం వరించదు. అయితే అదృష్టం వరించే సమయానికి మనుషులు అందుబాటులో ఉండరు.

అదృష్టం కంటే ముందే వచ్చిన మృత్యువు.. చనిపోయిన వ్యక్తికి మద్యం షాప్ లైసెన్స్
X

దిశ, వెబ్ డెస్క్: నేటి సమాజంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న మనుషులకు అన్ని సార్లు అదృష్టం వరించదు. అయితే అదృష్టం వరించే సమయానికి మనుషులు అందుబాటులో ఉండరు. తాజాగా ఇలాంటి ఘటనే నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. తెలంగాణ మద్యం టెండర్ల (Liquor tenders) కేటాయింపులో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకోగా.. అందరికీ ఆశ్చర్యం తో పాటు దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కాసాని అశోక్ (Ashok) అనే వ్యక్తి మద్యం దుకాణానికి టెండర్ వేసి అదృష్టం పరీక్షించుకున్నాడు. కానీ డ్రా జరగకముందే అశోక్ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందిన అశోక్ పేరుపైనే లక్కీ డ్రా (Lucky draw)లో షాప్‌ నెంబర్ 63 ఎంపిక కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఆధ్వర్యంలో జరిగిన లక్కీ డ్రాలో అశోక్ పేరిట షాప్ రావడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన వ్యక్తి పేరు పై మద్యం దుకాణం రావడం రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న ఘటనగా చెప్పవచ్చు. నిబంధనల ప్రకారం మృతుడి కుటుంబ సభ్యులలో ఒకరికి ఆ దుకాణం కేటాయించనున్నట్లు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సంతోష్ తెలిపారు. ఈ సంఘటన ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Next Story