తెలంగాణలో వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లు.. ఎప్పుడంటే ?

by velandi.Saikiran |

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లు ( Day care centers ) కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు

తెలంగాణలో వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లు.. ఎప్పుడంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లు ( Day care centers ) కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధుల కోసం ప్రతి జిల్లాలో.... ఒక డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒంటరితనం అలాగే తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ఈ నిర్ణయం... తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

వృద్ధుల కాలక్షేపం కోసం ఇండోర్ గేమ్స్ కూడా ఆడించబోతోంది. అలాగే.. యోగ, పుస్తకాలు, కథలు, మెడిటేషన్ చేసుకునేందుకు... వెసులుబాటు కల్పించేందుకు.. ఈ డే కేర్ సెంటర్లను తెరపైకి తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది లక్షల వరకు సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు లెక్కల్లో తేల్చింది. అందుకే వాళ్ళందరి కోసం... ఈ కొత్త స్కీం తీసుకురాబోతోంది రేవంత్ రెడ్డి. దీంతో సీనియర్ సిటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story