TG: సెక్రటేరియట్‌లో సోలార్ పార్కింగ్ నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్

by Gantepaka Srikanth |

TG: సెక్రటేరియట్‌లో సోలార్ పార్కింగ్ నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్

TG: సెక్రటేరియట్‌లో సోలార్ పార్కింగ్ నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సచివాలయం(Telangana Secretariat)లో పార్కింగ్ స్థలాల్లో సోలార్ ప్యానెల్స్‌(Solar Parking Panels)తో కూడిన కార్‌పోర్ట్‌లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా సోలార్ పార్కింగ్ నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 15వ తేదీన శంకుస్థాపన భూమిపూజ చేయనున్నారు. నిర్మాణానికి ప్రభుత్వం రూ.17 కోట్లు మంజూరు చేసింది. నైరుతీ, వాయువ్య విభాగాల్లో వాహనాల పార్కింగ్ ప్రాంతాన్ని కవర్ చేసే సోలార్-ప్యానెల్ పైకప్పు నిర్మాణం చేపట్టనున్నారు. బహుళ-స్థాయి పార్కింగ్ (G+2) సౌకర్యంతో కానోపీలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (TGREDCO), రాష్ట్ర రోడ్లు, భవనాల సంస్థలు సంయుక్తంగా ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. సచివాలయం విద్యుత్ అవసరాలను సోలార్ ఎనర్జీతో తీర్చడం, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం కావడం గమనార్హం.

Next Story