- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్‌కు దానం నాగేందర్ కృతజ్ఞతలు
మూసీ ప్రక్షాళన విషయంలో సీఎం రేవంత్ రెడ్డిది దీర్ఘకాలిక ప్రణాళిక అని, దీనివల్ల నగరంతో పాటు చుట్టూరా ఉన్న జిల్లాల పరిధిలోనూ మేలు జరుగుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ ప్రక్షాళన విషయంలో సీఎం రేవంత్ రెడ్డిది దీర్ఘకాలిక ప్రణాళిక అని, దీనివల్ల నగరంతో పాటు చుట్టూరా ఉన్న జిల్లాల పరిధిలోనూ మేలు జరుగుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మూసీ ప్రక్షాళన వల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. ఈ ఆలోచన చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోందని.. ఈ తరుణంలో మూడు కార్పొరేషన్ల ఏర్పాటు చేసినా వాటి పరిధిలో మౌలిక వసతులపై అయోమం ఉందని అన్నారు. మ్యాన్ పవర్, బడ్జెట్ విషయంలో స్పష్టత ఇవ్వలేదని ఆయన అన్నారు.
మరో 4, 5 మండలాలు జీహెచ్ఎంసీలో కలిపారని అంటున్నారని అన్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రజలంతా గర్వంగా భావిస్తారని అన్నారు. బీసీలకు సంఖ్య పరంగా 60శాతానికి పైగా ఉంటే కనీసం బీసీలకు సబ్ ప్లాన్ కేటాయించకపోవడం సరైన ఆలోచన కాదని అన్నారు. బీసీలను పరిగణనలోకి తీసుకోకుంటే తమపై సవతితల్లి ప్రేమ ఉన్నట్లు భావించాల్సి ఉంటుందన్నారు. తమ జీవనోపాధి కోసం కార్ల ద్వారా ఉపాధి పొందే వారుంటే వారికి కారు అనే నిబంధన పేరిట రేషన్ కార్డులు ఇవ్వకపోవడమనేది సరైన చర్య కాదన్నారు. బీసీ ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ పెండింగులో ఉన్నాయన్నారు.






