తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ దాదాపు ఖరారు?.. అధికారిక ప్రకటనే తరువాయి!

by Gantepaka Srikanth |

తెలంగాణ రాష్ట్ర నూతన పోలీస్ బాస్‌గా 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియామకం దాదాపు ఖరారైంది.

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ దాదాపు ఖరారు?.. అధికారిక ప్రకటనే తరువాయి!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర నూతన పోలీస్ బాస్‌గా 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో పూర్తిస్థాయి డీజీపీగా సీవీ ఆనంద్‌ను నియమించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడటమే ఇక తరువాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో, ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఆనంద్ చూపిన చొరవ, అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పలు సంస్కరణలను అమలు చేయడంలో ఆయన సమర్థతపై ముఖ్యమంత్రికి నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎస్ అధికారుల భారీ బదిలీల ప్రక్రియ కూడా ముగియడంతో, డీజీపీ నియామకానికి సంబంధించిన ఫైల్‌పై సంతకం జరిగే అవకాశం ఉంది.

పాలనలో కొత్త ఊపు..

రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాధాన్యతలకు అనుగుణంగా పోలీస్ శాఖలో మేజర్ ప్రక్షాళన చేపట్టింది. కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరిస్తే, రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ వ్యవస్థలో మరిన్ని కీలక మార్పులు మరియు సాంకేతిక సంస్కరణలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Next Story