- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌలు రైతులకు సాగు భారం.. చేసిన కష్టం భూస్వామికే చెల్లింపు
రాష్ట్రంలో కౌలు రైతులు అప్పుల భారంతో వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఎంత కష్టం చేసినా భూస్వాములకు చెల్లించడానికే సరిపోతుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కౌలు రైతులు అప్పుల భారంతో వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఎంత కష్టం చేసినా భూస్వాములకు చెల్లించడానికే సరిపోతుంది. కౌలు ధరల పెంపుతో పాటు పంట పెట్టుబడి పెరగడంతో సాగు చేసేందుకు వెనకడు వేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, కూలీలు, దున్నకానికి ట్రాక్టర్ల ధరలు పెరగడంతో పండించిన పంట ద్వారా వచ్చిన సొమ్ము వాటికే సరిపోతుంది. చిల్లిగవ్వ మిగలడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో అప్పులు పెరిగి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కౌలు రైతులను ఆదుకుంటామని చెప్తున్న పాలకులు పాసుబుక్కలిగిన రైతులకే సహాయం అందిస్తున్నారని నిజమైన సాగు చేసే రైతులను విస్మరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 70 లక్షల మంది పట్టాదారులు ఉంటే అందులో 18 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉన్నట్లు గుర్తించింది. వీరికి ప్రభుత్వం అమలు చేసే రైతు భరోసా, క్రాప్రుణాలు, అకాల వర్షాలకు పంట నష్ట పరిహారం అందడం లేదు. నాగలి అంటే తెలియని రైతులకు మాత్రమే ప్రతి పథకం దర్జాగా పంపిణీ జరుగుతోంది. పొలం దున్నిన రైతులకే ప్రభుత్వం సహాయం ఇవ్వాలని డిమాండ్వచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా అమ్మాలంటే పట్టాదారు పాసు బుక్ఉండాలి. అది వారికి లేకపోవడంతో దళారులకు ఎంతో కొంత ధరకు అమ్మే పరిస్థితి ఉంది. సవాలక్ష సమస్యలతో వ్యవసాయం చేయడం ఎందుకని కౌలు రైతులు సాగు చేసేందుకు ముందుకు రావడం లేదు.
ఎకరానికి రూ. 15 వేలు కౌలు
ప్రస్తుతం కౌలు ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. సారవంతమైన భూములకు ఎకరానికి రూ. 15 వేలు, ఆరుతడి పండించే భూములకు రూ. 12 వేల కౌలు ధరలు ఉన్నాయి. ప్రాజెక్టుల కింద భూముల ధరలు రూ. 20 వేలకు కౌలు ధర ఉంది. చాలా వరకు అరెకరం, ఎకరం భూములున్న రైతులు దానికి తోడుగా మరి కొంత భూమి సాగు చేసేందుకు కౌలు తీసుకోవాల్సి వస్తోంది. అయితే, భూయజమానులు ప్రతి ఏటా 25 శాతం వరకు పెంచుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే రైతు భరోసా, పీఎం కిసాన్ నిధి భూయజమానులకే దక్కుతోంది.
పంట సీజన్నుంచి ముగిసే వరకు సమస్యలే
వానకాలం పంట సీజన్ ప్రారంభం నుంచి ముగిసే వరకు కౌలు రైతులకు అడగడునా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఏడాది నుంచి పత్తి, యూరియా కొనుగోలు పూర్తిగా ఆన్లైన్విధానంలో జరిగింది. దానికి సర్వే నెంబర్, పట్టాదారు పాసు బుక్అవసరం ఉంటుంది. అది కౌలు రైతుకు ఉండదు దీంతో కౌలు తీసుకున్న యాజమాని ఆశ్రయించాలి. వారు కూడా ఆన్లైన్లో బుకింగ్చేయాలంటే ముందుకు రావడం లేదు. ఇలా పలు రకాలుగా కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.






