విద్యాశాఖపై సీఎస్ సమీక్షా సమావేశం.. అధికారులకు కీలక ఆదేశాలు

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో విద్యాశాఖపై అధికారులతో సీఎస్ రామకృష్ణ‌రావు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బోధన నాణ్యత పెంపుపై అధికారుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు.

విద్యాశాఖపై సీఎస్ సమీక్షా సమావేశం.. అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విద్యాశాఖపై అధికారులతో సీఎస్ రామకృష్ణ‌రావు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బోధన నాణ్యత పెంపుపై అధికారుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. అన్ని స్థాయిల విద్యా సంస్థల్లో మెరుగైన బోధనకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, డిజిటల్ విద్య పనితీరుపై సమీక్ష చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణంపై చర్చించారు. రిటైర్డ్ ప్రొఫెసర్లు, లెక్చరర్లతో విద్యార్థులకు ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాలని అధికారుల‌కు సూచించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, మోటివేషన్ పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాల‌న్నారు. కేజీబీవీ, సంక్షేమ వసతి గృహాల్లో మోడల్ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పారు. సోలార్ కిచెన్, మౌలిక వసతులతో ఆదర్శ వసతి గృహం అభివృద్ధి చేయాల‌ని అన్నారు. కళాశాలల్లో కెరీర్ గైడెన్స్ తరగతులు నిర్వహించాలని సూచించారు. B.Ed పూర్తి చేసిన విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్ బోధన జ‌రిపించాల‌ని అన్నారు.

Next Story