గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి : సీఎస్ ప్రత్యేక ఆదేశాలు

by Muthe.Rajitha |

గురుకులాల్లో మెరుగైన సేవలకు తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.

గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి  : సీఎస్ ప్రత్యేక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : గురుకులాల్లో మెరుగైన సేవలకు తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన భోజనం, చక్కటి మౌలిక సదుపాయాల కల్పించాలని సీఎం ఆదేశించారని, ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు మంగళవారం సెక్రటేరియట్​లో తెలంగాణలోని ప్రభుత్వ సాంఘిక, గిరిజన, మైనారిటీ వసతి గృహాల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్​రామకృష్ణారావు మాట్లాడుతూ.. విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపులను నేరుగా విద్యార్ధుల బ్యాంక్ అకౌంట్​లలోకి జమ చేసేందుకు తగు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని, అలాగే, డెబిట్ కార్డు తరహాలో ఒక స్మార్ట్ కార్డును అందించడం వల్ల విద్యార్థులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నారు.

విద్యార్ధులు వారికి కావాల్సిన సబ్బులు, కాస్మోటిక్ వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మొబైల్ విక్రయ కేంద్రాలతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ వసతి గృహాలకు సరిపడా నాణ్యమైన సరుకులు, విద్యార్థుల టెక్స్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్, బెడ్ షీట్లు, కార్పేట్స్, స్కూల్ బ్యాగ్స్ తదితర సామగ్రి సమకూర్చుకునేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సరుకుల క్వాలిటీ విషయంలో రాజీపడొద్దని సీఎం ఆదేశించారని, ఆ మేరకు అధికారులు తగు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సీఎస్ సూచించారు. ఈ సమావేశంలో ఎస్సీ డెవలప్ మెంట్ ముఖ్యకార్యదర్శి ఎన్. శ్రీధర్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఎ. వర్షిణి, సెర్ఫ్ సీఈఓ దివ్య, బీసీ వెల్ఫేర్ సెక్రెటరీ ఇ. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story