- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. ఎంపీ చామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
భారత 15వ ఉప రాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (CP Radha Krishnan) ఎన్నకైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: భారత 15వ ఉప రాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (CP Radha Krishnan) ఎన్నకైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి (Sudershan Reddy)పై 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణ (CP Radha Krishna)కు 437 ఓట్లు వస్తాయని బీజేపీ అంచనా వేయగా.. మొత్తం 452 ఓట్లు పోల్ అయ్యాయి. అంటే ఇండియా కూటీమి నుంచి 15 మంది క్రాస్ ఓటింగ్ చేశారు. అందులో ఆప్, డీఎంకే (DMK), శివసేన యూబీటీ, ఆర్జేడీ ఎంపీలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Kiran Kumar Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమి నుంచి పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి బలమైన అభ్యర్థి అని కొనియాడారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పడంలో అర్థం ఏంటని ప్రశ్నించారు. అధాకరంలో ఉన్నాం కదా.. అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాజకీయంగా పరిణతి చెందిన వ్యక్తులం కాబట్టే కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నికను స్వాగతిస్తున్నామని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.






