- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూలిన శిక్షణ విమానం, పైలట్లకు తీవ్ర గాయాలు.. మధ్యప్రదేశ్ లో ఘటన!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లాలో ఆదివారం బెలగావి ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన ఓ ప్రైవేట్ శిక్షణ విమానం కుప్ప కూలింది.

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లాలో ఆదివారం బెలగావి ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన ఓ ప్రైవేట్ శిక్షణ విమానం కుప్ప కూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడ్డ ఇద్దరు పైలట్లు హైదరాబాద్ కు చెందిన కెప్టెన్ వి. చంద్ర ఠాకూర్, నగేష్ కుమార్ లుగా గుర్తించారు. ఇంజన్ ఫెయిల్ కావటం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
గుణ పరిధిలోని కాంట్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ దిలీప్ రాజొరీయా తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో రెండు సీట్లున్న సెస్నా 152 అనే విమానం, ఇంజన్ వైఫల్యం కారణంగా 40 నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టినట్లు స్థానికులు తెలిపారని చెప్పారు. అయితే ఈ విమానం కర్ణాటకలోని బెలగావి ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కు చెందిందని, విమానాన్ని టెస్టింగ్ మరియు మెయింటెనెన్స్ పరీక్షల నిమిత్తం గుణాలోని షా - షిబ్ అకాడమీకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.






