- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వాతంత్య్రాన్ని అవమానించేలా ప్రధాని మోడీ ప్రసంగం.. సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట వద్ద ప్రధాని మోడీ చేసిన ప్రసంగం దేశ స్వాతంత్య్రాన్ని అవమానించేలా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: స్వాతంత్ర్య దినోత్సవ (Independence Day) వేడుకల్లో ఎర్రకోట వద్ద ప్రధాని మోడీ (Prime Minister Modi) చేసిన ప్రసంగం దేశ స్వాతంత్య్రాన్ని అవమానించేలా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) ఆరోపించారు. ఆ మేరకు ఆయన ఇవాళ ఒక వీడియో విడుదల చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశమంతా పండగ వాతావరణంలో ఉత్సవాలు చేసికొంటుంటే ఎర్రకోటపై నుంచి స్వాతంత్ర్య పోరాటాన్ని అవమాన పరిచే విధంగా ఉందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు ద్రోహం చేసే విధంగా ప్రధాని మోడీ మాట్లాడడం భారత ప్రజలను అవమానపరచడమేనని తెలిపారు.
1925లో సీపీఐ, ఆర్ఎస్ఎస్ (RSS) ఆవిర్భవించిందని తెలిపారు. ఆనాటి నుంచి (British) బ్రిటిష్ పాలనాకు వ్యతిరేకంగా సీపీఐ, ఇతర దేశభక్తులందరు ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. తుపాకీ గుండ్లకు బలయ్యారని, తూటాలకు లాఠీలకు ఎదురొడ్డారని పేర్కొన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ నాయకులు స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఏక్కడైనా పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. లాఠీలకు తూటాలకు గురయ్యారా? ఉంటే ఒక పేరు అయిన చెప్పగలరా? అని ప్రశ్నించారు. సావర్కర్ అండమాన్ జైలులో నుంచి బ్రిటీష్ పాలనకు లొంగిపోయి క్షమాపణ చెప్పి బయటికి వచ్చి, ఆర్ఎస్ఎస్ వాళ్లని బ్రిటిష్ ఉద్యమంలో పాల్గొనవద్దని ఆదేశించడం వాస్తవం కదా ? అని ప్రశ్నించారు. అలాంటి చరిత్ర కలిగిన సావర్కర్, ఆర్ఎస్ఎస్‌ను పొగడడమంటే అంతకన్నా మించిన దేశద్రోహం ఇంకొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు.






