పోలీసులపై CPIM తెలంగాణ కార్యదర్శి సీరియస్

by Gantepaka Srikanth |

ధన్వాడ రైతుల అరెస్ట్‌ను సీపీఐఎం(CPIM) తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) ఖండించారు.

పోలీసులపై CPIM తెలంగాణ కార్యదర్శి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ధన్వాడ రైతుల అరెస్ట్‌ను సీపీఐఎం(CPIM) తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరెస్ట్ చేసిన రైతులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే పొల్యూషన్ ఏర్పడుతుందని అన్నారు. బలవంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని అన్నారు. ఆపరేషన్ కగార్‌ను సైతం తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

కాగా, జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గంలో ఇథనాల్‌ ఫ్యాక్టరీపై (Ethanol Factory) స్థానిక రైతులు తిరగబడ్డారు. నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారు. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటుచేసిన షెడ్లను, వాహనాలను ధ్వంసం చేశారు. కంటెయినర్‌ను పెకిలించి వేసి నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని రైతులను అరెస్టు చేశారు.

Next Story