కొత్తగూడెం కార్పొరేషన్‌ సీపీఐ కైవసం

by Gantepaka Srikanth |

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో అనూహ్య ఫలితం వెలువడింది. సీపీఐ పార్టీ కొత్తగూడెం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో మొత్తం 47 డివిజన్లు ఉండగా.. సీపీఐ 25, కాంగ్రెస్‌ 14, బీఆర్ఎస్‌ 4, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్ 2 అభ్యర్థులు విజయం సాధించారు.

కొత్తగూడెం కార్పొరేషన్‌ సీపీఐ కైవసం
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌(Kothagudem Municipal Corporation)లో అనూహ్య ఫలితం వెలువడింది. సీపీఐ పార్టీ కొత్తగూడెం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో మొత్తం 47 డివిజన్లు ఉండగా.. సీపీఐ 25, కాంగ్రెస్‌ 14, బీఆర్ఎస్‌ 4, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్ 2 అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ హవా కొనసాగుతున్న తరుణంలో అనూహ్యంగా కొత్తగూడెంలో ఎర్రజెండా రెపరెపలు ఆడటం వామపక్ష శ్రేణులకు ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. మరోవైపు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మెుత్తం 48 డివిజన్లు ఉండగా.. కాంగ్రెస్ 35 స్థానాల్లో, బీఆర్ఎస్ 10 స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లో, స్వతంత్రులు ఒక చోట విజయం సాధించారు.

మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలికల్లోని 2,569 వార్డుల ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తి కాగా.. కాసేపట్లో తుది ఫలితం వెలువడనుంది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించి, భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద, స్ట్రాంగ్ రూమ్‌ల వెలుపల వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారులు నేరుగా ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

Next Story