అక్కడ 500 మంది అమ్మాయిలను అత్యాచారం చేసి చంపేశారు.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-08-09 06:38:07  IST  )

కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలు, పూడ్చివేతల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

అక్కడ 500 మంది అమ్మాయిలను అత్యాచారం చేసి చంపేశారు.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం (Dharmasthala) ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలు, పూడ్చివేతల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ ధర్మస్థల వివాదంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా తిరుమలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. (Karnataka) కర్ణాటకలోని ధర్మస్థల ట్రస్ట్ 70 ఏళ్లుగా ఒక కుటుంబం చేతిలో ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. వారికి ఏడాదికి వంద కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు. ఆ ట్రస్ట్ చైర్మన్‌ను బీజేపీ ఎంపీగా నామినేట్ చేసిందని వివరించారు. ధర్మస్థలలో దాదాపు 500 మంది అమ్మాయిలను అత్యాచారం చేసి చంపేసి అక్కడే పూడ్చిపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సిట్ వేసిందని తెలిపారు. అదే బీజేపీ సర్కార్ ఉంటే సిట్ ఏర్పాటు చేసేది కాదని విమర్శించారు. దీంతో అన్ని రకాల విషయాలు బయటకు వచ్చాయన్నారు. అక్కడ తవ్వుతుంటే స్మశాన వాటికలో ఉన్నట్లు అక్కడ అన్నీ పుర్రెలు, ఎముకలు బయటపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అది పవిత్ర పుణ్యక్షేత్రమా.. శ్మశానవాటికా..? అని ప్రశ్నించారు. సీపీఐ నేత ఎంపీగా చేయకూడని గతంలో ట్రస్ట్ సభ్యులు అడ్డుకున్నారని, అతను తెగించి పోటీ చేసినందుకు పదిహేనేళ్ల తన కుమార్తెను అత్యాచారం చేసి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ధర్మస్థల ట్రస్ట్‌ను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.

Next Story