- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ రిజర్వేషన్లపై ఎంపీ ఆర్ కృష్ణయ్యకు సీపీఐ నారాయణ సూటి ప్రశ్న
బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ఎంపీ, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్యపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ఎంపీ, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్యపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక వీడియో విడుదల చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపిస్తే కేంద్రం అడ్డుకుంటుందని అన్నారు. నేను బీసీని అని చెప్పుకునే ప్రధాని మోడీ ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారు? అని నిలదీశారు. బీజేపీ తరపున ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణయ్య ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? అని సూటిగా ప్రశ్నించారు.
బీజేపీ సంకలో ఉండి బీసీ ఉద్యమానికి కృష్ణయ్య న్యాయం చేయడం లేదన్నారు. పార్లమెంట్‌లో ఉన్న కృష్ణయ్య బీసీ ఉద్యమానికి మద్దతు తెలిపే పార్టీలను, నాయకులను ఎందుకు కలిసి ఎందుకు ఏకతాటిపైకి తీసుకురావడం లేదు? అని ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యులతో కలిసి ధర్నా చేస్తే సీపీఐ కూడా మద్దతు ఇస్తుందని సీపీఐ నారాయణ వ్యాఖ్యనించారు.






