- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవితను వదిలేయాలంటే చేయాల్సింది ఇదే: సీపీఐ నారాయణ
by GSrikanth |
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారా? లేదా? అని ఉత్కంఠతో నిండిపోయిందన్నారు. నరేంద్ర మోడీకి మద్దతుగా మోడీ జిందాబాద్ అంటేనే కవితను విడుదల చేస్తారని, లేదంటే అరెస్టు చేసి జైలుకు పంపుతామని నారాయణ పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితను ఈడీ విచారణకు పిలిచారని వివరించారు. బీజేపీతో పోరాడాలి తప్ప నిరుత్సహ పడకూడదని సూచించారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆరోపించారు. బీజేపీలో చేరిన వారు స్వచ్ఛమైన వ్యక్తులుగా మారతారని నారాయణ పేర్కొన్నారు.
Next Story






