- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబద్దాలను అవలీలగా చెప్పే వ్యక్తులు మోడీ, కేసీఆర్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
దేశంలో అబద్దాలను అందగా, అవలీలగా చెప్పే వ్యక్తులు దేశ ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్.కె.నారాయణ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో అబద్దాలను అందగా, అవలీలగా చెప్పే వ్యక్తులు దేశ ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్.కె.నారాయణ విమర్శించారు. పార్లమెంట్‌లో మోడీ , అసెంబ్లీలో కెసిఆర్ చెప్పినవని అబద్దాలేనని ఎద్దేవా చేశారు. శనివారం సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోడీ బానిసత్వం చేయడం దేశ ప్రజలందరికీ అవమానకరమన్నారు. ట్రంప్ నిరాశ, నిసృహాలతో ఇష్టానుసారంగా వ్యవరిస్తుండగా, మన దేశ ప్రధాని సృహాలో ఉండి కూడ అబ్దదాలు చెబుతున్నారని పేర్కొన్నారు. పహాల్గాం ఉగ్రవాదులను పార్లమెంట్ సమావేశాలకు ఒక్కరోజు ముందు హతమార్చి వారి శవాలను అడ్డం పెట్టుకుని సభలో తప్పించునే ప్రయత్నం చేశారన్నారు. కాశ్మీర్‌లో 7.50 లక్షల మందిని భద్రాత సిబ్బందిని మోహరించిన కేంద్రం ఉగ్రవాదులను పట్టుకోకుండా ఇంత కాలం ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ గ్రాఫ్ పడిపోవడంతో ఆర్‌ఎస్‌ఎస్ 75 ఏళ్ల వరకే పదవి కాలం అనే అంశాన్ని తెరపైకి తెచ్చిందని, అయితే ప్రధాన మంత్రి ఎవరూ అనేది ఇక్కడ కాదని, దేశ భద్రత, ఆర్ధిక వ్యవస్థ పట్ల కేంద్ర ప్రభుత్వ విధానాల మార్పు కావాలన్నారు.
ధర్మస్థల ఆలయాన్ని దేవాదాయ శాఖ అధీనంలోకి తీసుకోవాలి :
కర్నాటకలోని ధర్మస్థల పవిత్ర ఆలయాన్ని ట్రస్టీ అపవిత్రం చేసిందని, ఆ దేవాలయాన్ని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆలయంలో జరిగిన అన్ని దారుణాలకు ట్రస్ట్ బోర్డుదే బాధ్యతని వెంటనే బోర్డు సభ్యులను అరెస్టు చేయాలన్నారు. అక్కడ దాదాపు 400 మంది మహిళలనుమానభంగంచేసి అత్యంత కృరంగా చంపి పూడ్చిపెట్టారని, పవిత్ర ధర్మస్థలా, స్మశానమా అర్ధం కావడం లేదన్నారు. విద్యార్థుల ఫీజు రియాంబర్స్‌మెంట్ బిల్లులను 4 ఏళ్లగా పెండింగ్‌లో పెట్టడమంటే నేరపూరితమైన తప్పుఅని తక్షణమే ఉభయ తెలుగు రాష్ట్రాలు తక్షణమే విద్యార్థుల రియాంబర్స్‌మెంట్ ఫీజులు చెల్లించాలని సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక అందిన నేపథ్యంలో ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీల ఫిరాయింపులకు సంబంధించిమూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చినంత మాత్రాన జరిగేది ఏమి లేదని అన్నారు. స్పీకర్‌కు ఉన్న విశేష అధికారుల నేపథ్యంలో వారి తీర్పును ఎవరూ కాదనే పరిస్థితి ఉండదన్నారు. అయితే ఎంఎల్‌ఎలు, ఎంపిల పార్టీ ఫిరాయింపులపై ఎన్నికల కమిషన్ అసలు ఏమి చేస్తోందని ప్రశ్నించారు. సెప్టెంబర్ 22 నుంచి చండీఘర్‌లో సిపిఐ జాతీయ మహాసభలు జరగనున్నాయని తెలిపారు. ఈ మహాసభల్లో బిజెపి వ్యతిరేఖ ఫ్రంట్ బలోపేతం చేయడంతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలను ఉదృతం చేసే దీశగా కార్యచరణను రూపొందించనున్నట్లు వెల్లడించారు.






