- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fact Check: ట్రాఫిక్ చలానాల రాయితీలు.. ఫేక్ న్యూస్! సీపీ సజ్జనార్ హెచ్చరిక
సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కక్కుర్తితో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కక్కుర్తితో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను షేర్ చేశారు. మార్చి 14న లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చలానాలపై రాయితీలు అంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ ఫేక్ సమాచారం వీడియోలకు ఏకంగా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయని ఆశ్చర్యకరం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ చలానాల రాయితీలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ అధికారికంగా ఎలాంటి రాయితీలను ప్రకటించలేదని వెల్లడించారు. దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మకండని సూచించారు. ఇతరులకు షేర్ చేయకండి.. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించి, ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.






