ఈనెల 13న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డ్యూయల్ డిగ్రీ కోర్సులకు కౌన్సిలింగ్​

by Muthe.Rajitha |

ఈనెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు వాక్-ఇన్-కౌన్సిలింగ్ ను నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు.

ఈనెల 13న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డ్యూయల్ డిగ్రీ కోర్సులకు కౌన్సిలింగ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈనెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు వాక్-ఇన్-కౌన్సిలింగ్ ను నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎన్​ఆర్​ఐ ప్రాయోజిత కోటా బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్​ (ఫుడ్ టెక్నాలజీ), బీటెక్​(అగ్రికల్చరల్ ఇంజనీరింగ్), బీఎస్సీ (ఆనర్స్), కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ జరగనుందని పేర్కొన్నారు.

ఈ రెండు కౌన్సిలింగ్ లు రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్ మెంట్​ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలు, వెబ్ సైట్ లో పేర్కొన్న రుసుముతో కౌన్సిలింగ్ కు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.pjtau.edu.in లో చూడవచ్చన్నారు.

Next Story