- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ పాలనలో అవినీతి పెరిగింది: సీఎంకు పద్మనాభ రెడ్డి లేఖ
ఏసీబీ, విజిలెన్స్ శాఖలు విచారణ జరిపి ప్రభుత్వానికి పంపిన నివేదికలపై చర్యలు ఉండటం లేదని సీఎం రేవంత్ రెడ్డికి ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చైర్మన్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పద్మనాభ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏ కోశాన లేదని పేర్కొన్నారు. ఏసీబీ, విజిలెన్స్ శాఖలు విచారణ జరిపి ప్రభుత్వానికి పంపిన నివేదికలపై చర్యలు లేవని,. లంచం తీసుకుంటూ పట్టుబడిన లేక ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతితో ప్రభుత్వానికి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకున్న రిపోర్టులు సంవత్సరాల తరబడి ఎటువంటి చర్యలు లేక సచివాలయంలో పడి ఉన్నాయన్నారు. సచివాలయ ఉద్యోగస్తులు అవినీతి అధికారుల కొమ్ము కాస్తూ ఏసీబీ, విజిలెన్స్ రిపోర్టులను ఏదో ఓ వంకతో సాగదీసి చివరకు చిన్న పనిష్మెంట్, కేసు డ్రాప్ చేస్తున్నారని పేర్కొన్నారు.
323 కేసుల్లో 5 మాత్రమే డిస్పోజ్:
రాష్ట్ర సచివాలయంలో ఏసీబీ, విజిలెన్స్ పెండింగ్ కేసులు రెవెన్యూ శాఖలో ఎన్ని ఉన్నాయి సమాచార హక్కు చట్టం ద్వారా 2021 ద్వారా దరఖాస్తు చేస్తే సమాచారం ఇవ్వడానికి నిరాకరించారన్నారు. చివరగా అప్పీల్ చేయగా 27 జనవరి 2026న సమాచారం ఇచ్చారని ఈ సమాచారం పరిశీలిస్తే రాష్ట్ర సచివాలయంలో ఏసీబీ, విజిలెన్స్ శాఖల రిపోర్టులపై తగిన చర్యలు తీసుకోవడం లేదని స్పష్టమవుతోందన్నారు. రెవెన్యూ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం వారి శాఖలో మొత్తం 323 ఏసీబీ కేసులు ఉంటే అందులో 5 మాత్రమే డిస్పోజ్ అయ్యాయని మిగిలిన 318 కేసులు వివిధ దశలలో పరిశీలనలో ఉన్నాయని ఈ 323 కేసులలో చాలా మట్టుకు 10 సంవత్సరాల క్రితం నమోదైన కేసులు సైతం ఉన్నాయని పేర్కొన్నారు. ఇక విజిలెన్స్ కేసులు మొత్తం129 ఉంటే అందులో 8 కేసులు మాత్రమే డిస్పోజ్ అయి మిగతా 121 కేసులు సంవత్సరాల తరబడి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.
పట్టుబడినా లంచాలు తగ్గడం లేదు:
ఏసీబీ ప్రతిరోజు ఏదో ఓ చోట కేసులు నమోదు చేస్తున్నారు. అవినీతి అధికారుల ఇళ్లు సోదాలు చేసి పెద్ద ఎత్తున డబ్బు,ఆస్తులు పట్టుబడుతున్నాయి. దీనిని ప్రసార మాధ్యమాల్లో హైలైట్ చేస్తున్నాయి. దీంతో ప్రజలు ఏసీబీ పనిని ప్రశంసిస్తూ అవినీతి అధికారులకు శిక్ష పడుతోందని ఇక వారికి లంచాల బెడద తప్పుతుందని భావిస్తున్నారు. కానీ లంచాలు తగ్గకపోగా ఇంకా పెరుగుతున్నాయని అవినీతి అధికారులు ఏసీబీకి ఒకటి కంటే ఎక్కువ సార్లు పట్టుబడుతున్నవారు ఉన్నారని లేఖలో రాశారు. పాలనలో అవినీతి గురించి గతంలో ముఖ్యమంత్రికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సంబంధిత శాఖల కార్యదర్శులకు లేఖలు రాశామని అయితే వాటిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అందువల్ల ఏసీబీ, విజిలెన్స్ కేసులు తొందరగా పరిష్కారమయ్యేటట్లు, అవినీతి అధికారులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.






