- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Karimnagar: కరీంనగర్ పాలిటిక్స్.. బీజేపీకి మద్దతు తెలిపిన కార్పొరేటర్లు కాంగ్రెస్‍లోకి జంప్?
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య నంబర్ గేమ్ ఉత్కంఠ రేపుతుండగా, స్వతంత్ర కార్పొరేటర్ల మద్దతు కీలకంగా మారింది. శామీర్‌పేట్ రిసార్ట్‌లో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు సాగుతుండగా, కార్పొరేటర్ సాయిజ్యోతి వ్యవహారంపై బీజేపీ ఆందోళనకు దిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్ కార్పొరేషన్ (Karimnagar Corporation) రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. మేయర్ పీఠంపై (Mayor) ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుకు పై ఎత్తులు సంచలనం రేపుతున్నాయి. స్వతంత్రులతో మద్దతుతో మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని బీజేపీ ధీమాతో ఉంటే ఇదంతా రాజకీయం మా ప్రయత్నం మేము చేసుకుంటామంటూ బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. తమ పార్టీ కార్పొరేటర్లను శామీర్ పేట్ లియోనియో రిసార్ట్ లో కాంగ్రెస్ కార్పోరేటర్లతోపాటు కొందరు స్వతంత్రులతో మకాం వేసిన కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి క్యాంపు రాజకీయాలు సాగిస్తోంది. ఈ క్రమంలో కొద్ది సేపటి క్రితం రిసార్ట్ లో ఉన్న కార్పొరేటర్లతో మంత్రులు శ్రీదర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు చర్చలు జరిపారు.
పీసీసీ చర్చలు:
కాసేపట్లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం రిసార్ట్ కు చేరుకోబోతున్నారు. అక్కడ మేయర్ పీఠంపై కీలక చర్చలు జరపబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మొన్న బీజేపీకి మద్దతు ఇచ్చిన నలుగు స్వతంత్ర కార్పొరేటర్లలో ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి జంప్ అయినట్లు తెలుస్తోంది. వీరు ప్రస్తుతం కాంగ్రెస్ క్యాంపులోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ లో మ్యూజిక్ ఫిగర్ 36కు బీజేపీ ఇంకా ఒక్క ఓటు దూరంలో ఉంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఎక్స్ అఫీషియో ఓట్లు, ఇండిపెండెంట్‍ల ఓట్లతో నంబర్ గేమ్ మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ నుంచికార్పొరేటర్ ఇంటి వద్ద బీజేపీ ఆందోళన:
కరీంనగర్ కార్పొరేషన్ లో క్యాంపు రాజకీయాలు సాగుతుండటంతో బీజేపీ అప్రమత్తం అయింది. 15వ డివిజన్ కార్పొరేట్ ఏఐఎఫ్‍బీ కార్పొరేటర్ సాయిజ్యోతి మాట మార్చారండూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఫలితాల తర్వాత ఆమె బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. తాజాగా ఆమె ఓ వీడియో రిలీజ్ చేస్తూ ఈ నెల 16న జరిగే మేయర్ ఎన్నికల్లో నాకు నచ్చిన వారికి ఓటు వేసుకుంటానని చెప్పారు. నా పిల్లలకు ఆరోగ్యం బాగా లేక వేరే ఊరు వెళ్తున్నానని నా ఇంటి వద్ద ఆందోళన చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ వీడియో రిలీజ్ చేశారు. సాయిజ్యోతి తీరుపై బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆమె కాంగ్రెస్ క్యాంపుకు వెళ్లారంటూ ఆందోళనకు దిగారు.దీంతో ఆమె ఇంటి వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది.






