మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణకు కేంద్రం అలర్ట్

by Disha Web Desk 2 |
మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణకు కేంద్రం అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు, వైరల్ ఇన్ ఫెక్షన్‌లో ఆకస్మిక పెరుగుదల ఉండటంతో కేంద్రం అలర్ట్ అయింది. ఈ మేరకు మహామ్మారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖలు రాసింది. టెస్టులు, ట్రీట్ మెంట్, ట్రాకింగ్, టీకాలు వేయడంపై దృష్టిసారించాలని సూచించింది. అకస్మికంగా పెరుగుతున్న ఇన్‌ఫెక్షన్‌‌ను నియంత్రించడంపై ఫోకస్ పెట్టాలని లేఖలో పేర్కొంది. దీనికోసం రిస్క్ అసెస్‌మెంట్ ఆధారిత విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని కేంద్రం సూచించింది. కాగా గురువారం అప్ డేట్ చేసిన లెక్కల ప్రకారం గత నాలుగు నెలల విరామం తర్వాత ఒక రోజులో 700 కంటే ఎక్కువ కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,623 కి చేరుకుంది.


Next Story

Most Viewed