- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్, భట్టి ఛాంబర్లకు భారీగా క్యూ కట్టిన కాంట్రాక్టర్లు
తెలంగాణ సెక్రటేరియట్‌లోని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్స్ కు భారీ సంఖ్యలో కాంట్రాక్టర్లు తరలి రావడం తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సెక్రటేరియట్‌లోని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్స్ కు భారీ సంఖ్యలో కాంట్రాక్టర్లు తరలి రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆయా చాంబర్ల కొద్దిసేపు హైడ్రామా నడిచింది. తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని దాదాపు వంద మందికి పైగా కాంట్రాక్టర్లు రేవంత్, భట్టి ఛాంబర్ కు చేరుకున్నారు. అయితే అందరూ ఓకే శాఖకు వెళ్లేందుకు కాకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం వేర్వేరు శాఖల పేషీలకు వెళ్లాలని విజిటర్స్ పాసులు తీసుకున్నారు.
అనంతరం వీరంతా సీఎం, డిప్యూటీ సీఎంల ఛాంబర్లకు చేరుకోవడంతో అక్కడి సిబ్బంది అవాక్కయ్యారు. 'మన ఊరు - మన బడి' కార్యక్రమంలో పనిచేసిన చిన్న కాంట్రాక్టర్లు తమ పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం ఆయా చాంబర్ల వద్ద నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం బడా కాంట్రాక్టర్ల వద్ద నుంచి కమీషన్లు తీసుకొని వారి బిల్లులు క్లియర్ చేస్తూ, చిన్న కాంట్రాక్టర్లను వేధిస్తోందని వారు ఆరోపించారు.






