'ఖమ్మం ఖిల్లా'పై రూ.30 కోట్లతో 'రోప్ వే' నిర్మాణం! డిప్యూటీ సీఎం

by Geesa Chandu |

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

ఖమ్మం ఖిల్లాపై రూ.30 కోట్లతో రోప్ వే నిర్మాణం! డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దీని కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉనట్లు చెప్పారు. అయితే ఖమ్మం జిల్లాలోని ఉన్నటువంటి ఖిల్లా పై రూ. 30 కోట్లతో రోప్ వే ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పార్లమెంటు సభ్యులు రఘురాం రెడ్డి లతో కలిసి ఖమ్మం ఖిల్లాను సోమవారం భట్టీ సందర్శించారు. అయితే అంతకుముందే డిప్యూటీ సీఎం మజ్జు గూడెంలో బౌద్ధ స్థూపాన్ని మంత్రి పొంగులేటితో కలిసి పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన అభివృద్ది పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. "ఖమ్మం జిల్లాలో ఎకో మరియు ఆలయ టూరిజం అభివృద్దికి చాలా అవకాశాలున్నట్లు తెలిపారు. దీంతో పాటూ కిన్నెరసాని నుంచి భద్రాచలం వరకు ఎకో టూరిజానికి అనువుగా ఉనాయని, బౌద్ధ స్తూపం నుంచి జమలాపురం మీదుగా భద్రాచలంలోని సీతారాముల స్వామి ఆలయం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తే బాగుంటుందని" వెల్లడించారు. తర్వాత జూపల్లి మాట్లాడతూ.. "నెలకోసారి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లోని పర్యాటక ప్రదేశాలను కుటుంబంతో కలిసి వెళ్లాలి" అని అన్నారు.

Next Story