- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాంద్రాయన్ గుట్ట నియోజకవర్గంలో 3 కొత్త రిజర్వాయర్ల నిర్మాణం
పాతబస్తీలోని చాంద్రాయన్ గుట్ట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొత్తగా మూడు తాగునీటి రిజర్వాయర్లు నిర్మించడానికి ప్రభుత్వం రూ.50కోట్లకు పరిపాలన మంజూరు ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

చాంద్రాయన్ గుట్ట నియోజకవర్గంలో 3 కొత్త రిజర్వాయర్ల నిర్మాణం
రూ.50కోట్లకు పరిపాలన మంజూరు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
దిశ, తెలంగాణ బ్యూరో: పాతబస్తీలోని చాంద్రాయన్ గుట్ట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొత్తగా మూడు తాగునీటి రిజర్వాయర్లు నిర్మించడానికి ప్రభుత్వం రూ.50కోట్లకు పరిపాలన మంజూరు ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ రిజర్వాయర్లతో బండ్లగూడ ప్రాంతంలో మొఘల్ కాలనీ, క్రిస్టల్ టౌన్‌షిప్ (క్రిస్టల్ కాలనీ) కోహినూర్ గోల్డ్ స్టోన్ (కోహినూర్ కాలనీ), లేక్‌వ్యూ కాలనీ, మదీనా కాలనీ, గోల్డెన్ హిల్స్, హనుమాన్ టెంపుల్ ఏరియా (కృష్ణారెడ్డి నగర్) కాలనీలకు తాగునీటి సరఫరా పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. 2.5 మిలియన్ లీటర్ల సామర్థ్యం, 15 మీటర్ల ఎత్తు కలిగిన 3 కొత్త ఎలివేటెడ్ రిజర్వాయర్లతోపాటు క్లోరిన్ గదులను నిర్మించనున్నారు. లేక్‌వ్యూ హిల్స్ రిజర్వాయర్, బాలాపూర్ క్యాంపస్ రిజర్వాయర్, కృష్ణారెడ్డి నగర్ రిజర్వాయర్ (హనుమాన్ గుడి సమీపంలో) నిర్మించనున్నారు.






