- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dasoju Shravan : తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది : దాసోజు శ్రవణ్
హైదరాబాద్(Hyderabad) లోని సచివాలయం(Secretariate) పక్కన ఉన్న 125 అడుగుల Dr. BR అంబేద్కర్(Dr.BR Ambedkar) ప్రాంగణానికి తాళాలు వేసి నిర్బంధం చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆలోచనా విధానానికి అద్దం పడుతుందని డాక్టర్ దాసోజు శ్రవణ్(Dasoju Shravan) తీవ్రంగా విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లోని సచివాలయం(Secretariate) పక్కన ఉన్న 125 అడుగుల Dr. BR అంబేద్కర్(Dr.BR Ambedkar) ప్రాంగణానికి తాళాలు వేసి నిర్బంధం చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆలోచనా విధానానికి అద్దం పడుతుందని డాక్టర్ దాసోజు శ్రవణ్(Dasoju Shravan) తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్వి(BRSV) ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ప్రాంగణానికి వెళ్లి నిరసన తెలియ జేశారు. అంబేద్కర్‌ను నిర్బంధించడం అంటే కేవలం ఒక విగ్రహానికే కాదు, యావత్ తెలంగాణ ప్రజల భావోద్వేగాలను నిర్బంధించడమేనని ఆయన పేర్కొన్నారు.
అంబేద్కర్ గారి స్ఫూర్తి నిరోధించలేనిది
"సూర్య చంద్రులున్నంత కాలం అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఎవరూ నిరోధించలేరు. కానీ సీఎం రేవంత్ రెడ్డి, సైకో లా ప్రవర్తించి, అంబేద్కర్ విగ్రహా ప్రాంగణాన్ని కట్టడి చేయడం దారుణం" అని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ఈ చర్యలు తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. “కేవలం మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన విగ్రహం అన్న కోపంతో అంబేద్కర్ విగ్రహా ప్రాంగణానికి తాళాలు వేసినట్లయితే, అదే కేసీఆర్ నిర్మించిన తెలంగాణ సచివాలయంలో ఎలా కూర్చుంటున్నారు?” అంటూ దాసోజు శ్రవణ్ గారు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రజల సెంటిమెంట్లను తక్కువ చేసి, కుల రాజకీయం నడిపిస్తున్న సీఎం తక్షణమే తన తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. భారతదేశానికి చెందిన మహనీయుడైన అంబేద్కర్ ను అవమానించడం సరికాదని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.






