- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నార్త్ ఇండియా ఐఏఎస్‌ల కుట్రలు..! సక్సెస్‌ఫుల్‌గా ఎక్స్‌టెన్షన్ కొట్టిన సీఎస్
పొలిటికల్ లీడర్ల మధ్య ఉండే వైరం పబ్లిక్‌గా కనిపిస్తుంటుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: పొలిటికల్ లీడర్ల మధ్య ఉండే వైరం పబ్లిక్‌గా కనిపిస్తుంటుంది. అదే బ్యూరోక్రాట్స్ మధ్య ఉండే విభేదాలు బయటికి కనిపించవు. కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు. కానీ తమకు రావాల్సిన అవకాశం మరొకరికి వస్తుందని తెలిస్తే.. దాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అదే రీతిలో ఈ మధ్య సీఎస్ రామకృష్ణారావుకు ఎక్స్‌టెన్షన్ రాకుండా అడ్డుకునేందుకు కొందరు ఐఏఎస్‌లు ఒక గ్రూపుగా కలిసి ఆయనకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేసినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఏకమైన నార్త్ ఐఏఎస్‌లు..!
రాష్ట్ర అర్థిక పరిస్థితులను చక్కదిద్దడం, పాలనా వ్యవహారాలను సమన్వయం చేయడంలో అనుభవం ఉన్న రామకృష్ణారావు సేవలను మరికొంత కాలం ఉపయోగించుకోవాలని భావించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రానికి లేఖ రాశారు. ఢిల్లీకి వెళ్లిన సమయంలో కేంద్ర మంత్రులను కలిసి స్వయంగా అప్పీలు చేశారు. దీంతో ఈ నెల 31న రిటైర్ కానున్న రామకృష్ణారావు పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి చివరి వరకు (7 నెలల పాటు) కేంద్రం పొడిగించింది. అయితే సీఎస్‌గా రామకృష్ణారావు రిటైర్ అయితే ఆ కుర్చీలో కూర్చోవాలని టార్గెట్ పెట్టుకున్న ఉత్తరాదికి చెందిన స్పెషల్ సీఎస్ హోదాలోని ఓ ఐఏఎస్ అయనకు వ్యతిరేకంగా పావులు కదిపినట్లు సమాచారం. రామకృష్ణారావుకు వ్యతిరేకంగా డీఓపీటీ విభాగానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. సదరు సీనియర్ ఐఏఎస్‌కు మద్దతుగా ఉత్తరాదికి చెందిన ముగ్గురు స్పెషల్ సీఎస్‌లు, ఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ సపోర్టు చేసినట్లు సెక్రెటేరియట్ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. వారందరికీ సీఎంఓలోని ఓ సెక్రెటరీ సైతం మద్దతు పలికినట్లు ప్రచారం జరుగుతున్నది. సీఎం రేవంత్ సపోర్టు, కేంద్ర ప్రభుత్వంలో రామకృష్ణారావుకు ఉన్న వ్యక్తిగత పరిచయాలు ఆయనకు ఎక్స్‌టెన్షన్ తెచ్చి పెట్టాయని ఐఏఎస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.






