- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ దంద్వనీతి : కేటీఆర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక(Delhi Assembly Elections)లు కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాల(Congress's Double Standards)కు, కపట చేష్టలకు ఖచ్చితమైన కేస్ స్టడీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక(Delhi Assembly Elections)లు కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాల(Congress's Double Standards)కు, కపట చేష్టలకు ఖచ్చితమైన కేస్ స్టడీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా విమర్శించారు. ఆమ్మ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ఇండియా కూటమిలో చేరి..కాంగ్రెస్ తో జతకట్టినప్పుడు అతను, ఆప్ పార్టీ నీతివంతమని..కేజ్రీవాల్ తెలివైన, స్వచ్ఛమైన నాయకుడని కాంగ్రెస్ ప్రశంసించిందని గుర్తు చేశారు.
కూటమి-లేతరంగు అద్దాల ద్వారా ఢిల్లీ అద్భుతంగా అభివృద్ధియుతంగా అప్పుడు కనిపించిందన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా నిలబడాలని నిర్ణయించుకున్న క్షణం, అతను దోషిగా..నేరస్థుడుగా, ఢిల్లీ ఒక డంప్ గా కాంగ్రెస్ కు కనిపిస్తుందని..అకస్మాత్తుగా ఆప్ అవినీతి మయమైన పార్టీగా మారిపోయిందని కేటీఆర్ విమర్శించారు. ఈ నాటకీయ మార్పు కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు పాఠ్యపుస్తకం లాంటి ఉదాహరణ అని..వారు ఇంత త్వరగా తమ ట్యూన్‌ను ఎలా మార్చగలిగారన్నది ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ తీరును ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ ఢిల్లీ ఓటర్లను మోసం చేసినప్పుడల్లా మీరు తెలంగాణను సందర్శించండని..ఏడాది పాలనలో మీరు ఇచ్చిన హామీల అమలు పూర్తయ్యయో లేదో మీకోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులతో మాట్లాడండని కేటీఆర్ డిమాండ్ చేశారు.






