Congress: బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత.. కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు

by Ramesh Naini |

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Congress: బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత.. కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (BRS MLA Padi Kaushik Reddy) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ (Congress) శ్రేణులు పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కామెంట్స్ నేపథ్యంలో ఆయనపై తెలంగాణ వ్యాప్తంగా పదికిపైగా పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. నిన్న గాడిదపై కౌశిక్ రెడ్డి చిత్రపటం ఉంచి ఊరేగింపు చేశారు. నేడు కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ శంషాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణుల నిరసన ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) చేయిస్తున్నారని, ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వారిని బ్లాక్ మెయిల్ చేయిస్తున్నారని శుక్రవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్‌పై కాంగ్రెస్ నాయకులు కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసి.. పదికిపైగా స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు.

Next Story