- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : కాంగ్రెస్ పాలన అట్టర్‌ఫ్లాప్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన(Congress Govt)పై విపక్షాల విమర్శలు ఆగడం లేదు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన(Congress Govt)పై విపక్షాల విమర్శలు ఆగడం లేదు. కాంగ్రెస్ పాలన పూర్తిగా ఫెయిల్ అయిందంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పలు తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ అట్టర్‌ఫ్లాప్ అయిందంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) విమర్శించారు. రేవంత్ రెడ్డి కావాలనే కాళేశ్వరం(Kaleshwaram Proect) మీద కక్ష కట్టారని మండిపడ్డారు. దానివల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
గత ఏడాది పుష్కలంగా వానలు కురిసినా ఇన్ని ప్రాజెక్టులు, ఎత్తి పోతల పథకాలు అందుబాటులో ఉన్నా.. ఒక్కదానిని కూడా సద్వినియోగం చేసుకోకపోవడం వల్లే రైతుల పంటలు ఎండిపోవడానికి కారణం అన్నారు. ప్రాజెక్టులను ఎండబెట్టవచ్చు గాని, ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్(KCR) ను రేవంత్ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తథ్యం అని బాల్క సుమన్ తెలియజేశారు.






