- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao : కాంగ్రెస్ పాలన పేదలకు శాపం : హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Government) నిర్లక్ష్యం(Negligence,) పేద ప్రజలకు శాపం(Curse for the Poor)గా మారిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Government) నిర్లక్ష్యం(Negligence,) పేద ప్రజలకు శాపం(Curse for the Poor)గా మారిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) ఎక్స్ వేదికగా మండిపడ్డారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయక పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిన దుస్థితిని ఆయన గుర్తు చేస్తూ ఆరోగ్య శ్రీ సేవల కోసం ఆసుపత్రికి వచ్చిన ప్రజల రద్దీ వీడియోను పోస్టు చేశారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికి రాష్ట్రానికి పట్టింపు లేకపోవడం దురదృష్టకరమన్నారు.నెట్వర్క్ ఆసుపత్రుల డిమాండ్లు పరిష్కరించి, పెండింగ్ బకాయిలు చెల్లించి ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బకాయిలు దాదాపుగా రూ.1000కోట్ల మేరకు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు స్కీమ్ సేవలను నిలిపివేశాయి. ప్రభుత్వం పలు దఫాలుగా వారితో చర్చలు జరిపినప్పటికి బకాయిల చెల్లింపులపై ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆరోగ్య శ్రీ అమలుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం కోసం లక్షలు ఖర్చవుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి రోగులకు ఆరోగ్య శ్రీ సంజీవనిలా పనిచేస్తుంది. అలాంటి ప్రభుత్వ స్కీంను ప్రైవేట్ ఆస్పత్రులు నిలిపివేయడంతో సాధారన ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు.
అటు పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమ్ అమలును కూడా ఆసుపత్రులు ఆపివేయడంతో పోలీసు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.






