- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్లు రవికి పీసీసీ చీఫ్ ఫోన్.. రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?
సొంత నేతలపై గతకొన్ని రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) హాట్ కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: సొంత నేతలపై గతకొన్ని రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) హాట్ కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని, అంతేగాకుండా తన నియోజకవర్గానికి నిధులు కూడా మంజూరు చేయడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. అయితే.. రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ(PCC Disciplinary Committee) చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. రాజగోపాల్ వ్యాఖ్యలను పరిశీలించామని శనివారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తెలిపారు. ఆయన గురించి క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారు..? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలుసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు గాంధీ భవన్ వేదికగా నిర్వహించబోయే పీసీసీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్‌పై అందరికీ ఆసక్తి నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మల్లు రవి నేతృత్వంలో ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై చర్చిస్తారని తెలుస్తోంది. దీంతో పాటు గజ్వేల్‌లో కాంగ్రెస్ నేతల పంచాయితీపైనా చర్చించే అవకాశం ఉంది.






