పాముకు కోరల్లోనే విషం.. కేటీఆర్‌కు ఒళ్లంతా విషమే: కాంగ్రెస్ ఎంపీ

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పాముకు కోరల్లోనే విషం.. కేటీఆర్‌కు ఒళ్లంతా విషమే: కాంగ్రెస్ ఎంపీ
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. పాముకు కోరళ్లనే విషం ఉంటుంది.. కానీ కేటీఆర్‌కు ఒళ్లంతా విషమే ఉంది. తరచూ ప్రజలను తప్పుదోవ పట్టించడం కేటీఆర్‌కు అలవాటే. తాజా అంశాన్ని కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం కూలేశ్వరం అయింది. అయినా కూడా బీఆర్ఎస్‌ నేతలంతా కేసీఆర్‌ను మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనుకుంటున్నారు. కాంగ్రెస్ హయాంలో కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితా ఉందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న భూమి రెండు కోట్ల 75 లక్షల ఎకరాలు మాత్రమే. అందులో కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉందని కేటీఆర్ మాట్లాడుతున్నారు. అసలు కేటీఆర్‌ను చూస్తే నవ్వాలో తెలియడం లేదు.. ఏడవాలో తెలియడం లేదు. ఏం చేసినా ప్రజలు బీఆర్ఎస్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరు. పదేళ్ల పాలనతో విసిగిపోయి తమకు అవకాశం ఇచ్చారు. ప్రజా పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Next Story