‘నెత్తిమీద‌ బొచ్చే లేద‌నుకున్నా.. త‌ల‌లో మెదడు కూడా లేదా?’.. MP అర్వింద్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-10 11:29:54  IST  )

తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha), నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌(Arvind Dharmapuri)పై కాంగ్రెస్ యువనేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmoor Venkat) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘నెత్తిమీద‌ బొచ్చే లేద‌నుకున్నా.. త‌ల‌లో మెదడు కూడా లేదా?’.. MP అర్వింద్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha), నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌(Arvind Dharmapuri)పై కాంగ్రెస్ యువనేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmoor Venkat) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సీఎల్పీలో వెంకట్ మాట్లాడుతూ.. క‌విత త‌న రాజ‌కీయ జీవితం కోసం నిరుద్యోగుల(Unemployed) జీవితాల‌తో ఆడుకుంటోందని మండిపడ్డారు. వంటావార్పు క్రాస్ రోడ్డులో కాదు.. ముందు మీ బాపు ముందు చేయి.. క్వశ్చన్ పేప‌ర్లు అమ్ముకుని నిరుద్యోగుల జీవితాల‌తో ఆడుకున్న వాళ్ల ఇంటి ముందు చేయి అని హితవు పలికారు. ఆనాడు నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు ఎటు పోయావ్ అని కవితను ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు రాకా, వేసిన నోటిఫికేషన్లను కోర్టు కేసుల్లో ఇరికించి, నిరుద్యోగులతో చెలగాటం ఆడినప్పుడు కవిత ఏమైపోయిందని అడిగారు. ఇవాళ రాజకీయ పబ్బం కోసం.. ప్రచారం కోసం.. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. క‌విత మాయలో నిరుద్యోగులు ప‌డొద్దు.. కోచింగ్ సెంట‌ర్ల య‌జమానులు కొంద‌రు క‌వితతో క‌లిసి ఈ కుట్రకు తెరదీశారని అన్నారు. ఇప్ప‌టికే 60 వేల‌కుపైగా పోస్టుల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింది. ప్ర‌స్తుతం కొన్ని శాఖ‌లు నోటిఫికేష‌న్లు కూడా ఇచ్చాయి. భ‌విష్య‌త్తులో అనేక నోటిఫికేష‌న్లు రాబోతున్నాయి.. నిరుద్యోగులంతా ప‌రీక్ష‌ల కోసం స‌న్నద్ధం కావాల‌ని కోరారు.

ఇప్పటివరకు ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌కు నెత్తిమీద‌ బొచ్చే లేద‌నుకున్నా.. కానీ ఆయ‌న మాట‌లు చూస్తుంటే త‌ల‌కాయలో గుజ్జు కూడా లేదనిపిస్తోంది. తలలోని మెద‌డు మోకాలులోకి జారి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడని బల్మూరి వెంకట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో న్యాయంపోరాటం చేస్తున్నారు. బీసీ బిడ్డ‌వై ఉండి బిల్లును రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర పెండింగ్‌లో ఉంటే.. ఆమోదించాల‌ని ఒత్తిడి చేయ‌లేని నువ్వు.. క‌నీసం మాట కూడా మాట్లాడ‌లేని నువ్వు.. బీసీ ద్రోహివి అని అన్నారు. నువ్వు మాట తీరు మార్చుకోకపోతే.. ఇదే నిజామాబాద్ ప్రజలు నిన్ను రోడ్లపై కొట్టే పరిస్థితి వ‌స్తుందని చెప్పారు. బీసీల ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీలో తాక‌ట్టు పెట్టి ఇక్క‌డ సింప‌తి మాట‌లు మాట్లాడితే జ‌నం న‌మ్మే ప‌రిస్థితిలో లేరని అన్నారు. నువ్వు అస‌లు సిస‌లు బీసీవి అయితే రిజ‌ర్వేష‌న్ల కోసం కేంద్రాన్ని నిల‌దీయి.. ఢిల్లీలో ఆమ‌ర‌ణ దీక్ష చేయి.. నోరుంది క‌దా అని మా ముఖ్య‌మంత్రి పైన వాగితే మా కార్య‌క‌ర్త‌లు ఉరికిస్తారు జాగ్ర‌త్త అని హెచ్చరించారు.

Next Story