- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్, బీజేపీలపై MLC జీవన్ రెడ్డి సీరియస్ కామెంట్స్
బీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై న్యాయ విచారణను బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అడ్డుకుంటున్న విధానానికి బీజేపీకి కూడా సపోర్ట్ చేస్తోందని అన్నారు. జ్యూడీషియల్ ఎంక్వైరీ చాలా పారదర్శకమైనదని అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాతంగా విచారణ చేపట్టబోతున్నామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ 420 కేసీఆర్, మోసగాడు కేటీఆర్ అని జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నెల రోజుల్లోనే హామీలను అమలు చేయలేదంటూ, కాంగ్రెస్‌ను 420 అని కేటీఆర్ అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మొదటగా దళితులను మోసం చేశారని మండిపడ్డారు. అనంతరం దళితులకు మూడు ఎకరాల భూమి అని మోసం, ఇలా 'మీరిచ్చిన హామీలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి కేటీఆర్' అంటూ ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్లలో నగరంలో తప్ప ఎక్కడైనా ఇళ్లు కట్టారా అంటూ ప్రశ్నించారు.






