సొంత కుటుంబంపై కవిత సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ కంప్లైంట్

by Gantepaka Srikanth |

మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao), మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ రావు(Santosh Rao) టార్గెట్‌గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

సొంత కుటుంబంపై కవిత సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ కంప్లైంట్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao), మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ రావు(Santosh Rao) టార్గెట్‌గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌(KCR)కు అవినీతి మరక ఎవరి కారణంగా అంటిందనేది ప్రజలు ఆలోచన చేయాలని కవిత కోరారు. కేసీఆర్‌ పక్కన ఉండేవాళ్ల వల్లనే ఈ దుస్థితి వచ్చిందని కవిత ఆరోపించారు. ఐదేళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావుది కాళేశ్వరం అవినీతిలో ప్రధాన పాత్ర కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు మరక అంటించడంలో హరీష్ రావు, సంతోష్‌ల అవినీతే ప్రధాన కారణమని ఆరోపణలు చేశారు. ఇందులో మేఘా సంస్థ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్‌లు మాత్రం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఆస్తులు పెంచుకునే ఆలోచన చేశారని ఘాటు విమర్శలు చేశారు. అయితే.. ఎమ్మెల్సీ కవిత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై సెప్టెంబర్ 2న చేసిన ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmoor Venkat) ఫిర్యాదు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు.

Next Story