కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌కు డాక్టరేట్.. కాంగ్రెస్ MLA షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)పై కాంగ్రెస్(Congress) నేత, ఎమ్మెల్యే నాయిని రాజేందర్(Naini Rajender Reddy) తీవ్ర విమర్శలు చేశారు.

కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌కు డాక్టరేట్.. కాంగ్రెస్ MLA షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)పై కాంగ్రెస్(Congress) నేత, ఎమ్మెల్యే నాయిని రాజేందర్(Naini Rajender Reddy) తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించడంలో కేసీఆర్ నిపుణుడు అని.. ఈ విషయంలో ఆయనకు డాక్టరేట్ ఇచ్చినా తప్పులేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను చూసి కేటీఆర్‌ కూడా బాగానే మోసాలు నేర్చుకున్నాడని అన్నారు. మోసాలు, దగా చేయడంలో కేటీఆర్‌(KTR) కూడా పరిణితి చెందాడని.. డాక్టరేట్‌కు కేటీఆర్‌ సైతం అర్హత సాధించాడని తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ సభలను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని.. చచ్చిన పార్టీని ఇంకెంత చంపుతామని అన్నారు.

పోలీస్ ఫార్మాట్‌(Police Format)లో దరఖాస్తు చేయకుండా పబ్లిసిటీ కోసమే సభ విషయంలో బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లారని అన్నారు. ఇదిలా ఉండగా.. వరంగల్ జిల్లా హన్మకొండలో నిర్వహించబోయే బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ సభకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సభకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటూ కోర్టును ఆశ్రయించారు. ఆ సభకు అనుమతిపై పరిశీలిస్తున్నామని కోర్టుకు జీపీ తెలిపారు. వారం రోజుల్లో వరంగల్ సభ అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈనెల 27న హన్మకొండలోని ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ సభ నిర్వహించాలని నిర్ణయించారు.

Next Story