- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగదీష్ రెడ్డి ఒక జోకర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy)పై ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య(Beerla Ilaiah) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy)పై ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య(Beerla Ilaiah) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్గొండలో జగదీష్ రెడ్డి ఒక జోకర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగదీష్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. అసలు జగదీష్‌రెడ్డి స్థాయి ఏంటని ప్రశ్నించారు. ఆయన జడ్పీటీసీకి ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ అని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లుగా తుంగతుర్తికి గోదావరి నీళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రశ్నించారు.
కాగా, అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి తెలంగాణకు చేసింది ఏమీ లేదని అన్నారు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటేనని విమర్శించారు. నానాటికీ ఆయన తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అసత్యాలతో సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీర్ల అయిలయ్య.. జగదీష్ రెడ్డిపై తీవ్రంగా మాట్లాడారు.






