కేసీఆర్ మూలంగా అవ‌మాన‌ప‌డిన వాళ్లల్లో నేను కూడా ఉన్నా: వేముల వీరేశం

by Gantepaka Srikanth |

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని కేసీఆర్ ఆ నాడు చెప్పారని, తన నియోజ‌క‌వ‌ర్గంలో మిషన్ భగీరథ పైన బహిరంగ చర్చకు తాను సిద్ధమని, నకిరేకల్ నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో అయినా ఇంటింటికి నీళ్లు ఇచ్చిన‌ట్లు నిరూపిస్తే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటానని ప్రభుత్వ విప్, వేముల వీరేశం సవాల్ విసిరారు.

కేసీఆర్ మూలంగా అవ‌మాన‌ప‌డిన వాళ్లల్లో నేను కూడా ఉన్నా: వేముల వీరేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని కేసీఆర్ ఆ నాడు చెప్పారని, తన నియోజ‌క‌వ‌ర్గంలో మిషన్ భగీరథ పైన బహిరంగ చర్చకు తాను సిద్ధమని, నకిరేకల్ నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో అయినా ఇంటింటికి నీళ్లు ఇచ్చిన‌ట్లు నిరూపిస్తే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటానని ప్రభుత్వ విప్, వేముల వీరేశం సవాల్ విసిరారు. మంగళవారం ఆయన సీఎల్పీ మీడియా సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ జగిత్యాల స్పీచ్ అంతా పిట్టకథలు, ఉత్తమాటలని, విషం చిమ్మడమే తప్ప కేసీఆర్ ఆ స్పీచ్‌లో విషయం లేదని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని బదనాం చేయాలని కేసీఆర్ మాట్లాడారని, దొరల గడీలు బద్దలు కొట్టడమే అలిశెట్టి ప్రభాకర్ కవిత రాశారని, కేసీఆర్ అలిశెట్టి పేరును తీసుకుని మాట్లాడటం వల్ల ఆయన ఆత్మ ఘోషిస్తుందన్నారు. పెద్ద మనిషిగా కేసీఆర్ గౌరవం పొగొట్టుకోవద్దన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలో అవమానాలు పడిన వారి లిస్టు రాస్తే రామాయణం అంత ఉంటుందని, ఎంతో మందిని కేసీఆర్ అవమానించారని, ఆయన మూలంగా అవ‌మాన‌ప‌డిన వాళ్లల్లో తాను కూడా ఉన్నానని వేముల వీరేశం తెలిపారు.

అవినీతికి కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబం..

తనకు మంచి ప‌ద‌వి ఇస్తాన‌ని కేసీఆర్ హామీ ఇచ్చారని, 20 సార్లు దండ‌పెట్టినా తనకు పార్టీ స‌భ్యత్వం కూడా ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన వాళ్లతో కేసీఆర్ కనీసం మాట్లాడలేదని, ఆయనకు మనుషుల విలువ తెలియదని వేముల వీరేశం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అబ‌ద్దాలు చెపుతారని, జీవితంతా త‌ప్పులేనా అని ఆయన ప్రశ్నించారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబమని, కేసీఆర్ ప్రభుత్వం అంటేనే స్కాంలు, అమ‌ర‌వీరుల స్థూపంతో స‌హా అన్నింట్లో అవినీతి చేశారని వేముల వీరేశం ఆరోపించారు. తెలంగాణ ప్రజ‌లు ఆనందంగా ఉండటాన్ని కేసీఆర్ జీర్ణియించుకోలేక‌పోతున్నారని, రేవంత్ రెడ్డి పాల‌న‌ను స‌హించ‌లేక‌పోతున్నారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. బెల్లి ల‌లిత‌, గ‌ద్దర్ లాంటి వాళ్లతో తెలంగాణ ఉద్యమం మొద‌లైందని, అనేక మంది తెలంగాణ కోసం బ‌లైయ్యారు.. వాళ్ల బ‌లిదానాల‌పైన తెలంగాణ వాదం బ‌తికింది..తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని కేసీఆర్ క‌బ్జా చేశారని వేముల వీరేశం ఆరోపించారు. 2023లో చుట్టు ఉన్న వాళ్లు కేసీఆర్‌ను ముంచారని, వాళ్ల మాటలు వింటే భవిష్యత్తులో మరో గుండు సున్నా వస్తుంది జాగ్రత్త.. విషపూరిత పదజలాన్ని కేసీఆర్ వాడకపోవడం మంచిదని ఆయన హితవుపలికారు.

జీవ‌న్ రెడ్డికి మూడునాళ్ల ముచ్చటే..

జీవ‌న్ రెడ్డి మీకు మూడునాళ్ల ముచ్చటే అని, ఆ త‌ర్వాత ఫామ్ హౌస్ గేట్లు కూడా తెరుచుకుకోవు.. ముందు స్వర్గం చూపిస్తారు.. త‌ర్వాత ఏమీ ఉండ‌దని వేముల వీరేశం అన్నారు. కేసీఆర్ వ‌చ్చేది లేదని, హైడ్రా ఎత్తేసేది లేదు.. బీఆర్ఎస్ బ‌తికి బ‌ట్టక‌ట్టలేదని, కేసీఆర్, బీఆర్ఎస్ రావాల‌ని ఎవ‌రూ కోరుకోవ‌డం లేదన్నారు. హైదరాబాద్‌లో 28 వేల అక్రమ కట్టడాలున్నాయి వాటిని కూల్చి వేస్తామని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పారని, నల్గొండ జిల్లా రైతుల కోసం మూసీ ప్రక్షాళనకు సీఎం ముందుకు వస్తే సీఎంకి మంచి పేరు వస్తుందని ఓర్వ లేక కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని వేముల వీరేశం మండిపడ్డారు.

Next Story