- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్తీ దవాఖాన్లపై బీఆర్ఎస్ ప్రజలకు అపనమ్మకం కలిగిస్తోంది: ఎమ్మెల్యే శ్రీ గణేష్
పండగపూట బస్తీ దవాఖాన్లపై కేటీఆర్ దండుపాళ్యం ముఠా దాడి చేసిందని, హాస్పిటల్స్‌కు వెళ్లి డాక్టర్లు, సిబ్బందిని ఇబ్బంది పెడుతూ.. వైద్య సేవలకు ఆటంకం కలిగించారని కాంగ్రెస్ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండిపడ్డారు. పేదల హాస్పిటళ్లపై బురద జల్లుతూ, కార్పొరేట్ హాస్పిటళ్లకు లబ్ది చేకూర్చేందుకు శత విధాలా ప్రయత్నం చేశారన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పండగపూట బస్తీ దవాఖాన్లపై కేటీఆర్ దండుపాళ్యం ముఠా దాడి చేసిందని, హాస్పిటల్స్‌కు వెళ్లి డాక్టర్లు, సిబ్బందిని ఇబ్బంది పెడుతూ.. వైద్య సేవలకు ఆటంకం కలిగించారని కాంగ్రెస్ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండిపడ్డారు. పేదల హాస్పిటళ్లపై బురద జల్లుతూ, కార్పొరేట్ హాస్పిటళ్లకు లబ్ది చేకూర్చేందుకు శత విధాలా ప్రయత్నం చేశారన్నారు. యూసఫ్‌గూడ బస్తీ దవాఖానలో ఓ జోకర్ తన అజ్ఞానాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని, మెడిసిన్‌పై ఉన్న మానుఫాక్చరింగ్ తేదీలను, సప్లై తేదీలుగా చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని శ్రీగణేష్మండిపడ్డారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఒకరేమో బస్తీ దవాఖాన్లలో అసలు మందులే లేవంటున్నారని, ఇంకొకరేమో ఎక్స్‌పైర్డ్ మెడిసిన్ ఇస్తున్నారంటూ ప్రజలకు ఆందోళనకు గురి చేస్తున్నారని శ్రీ గణేష్విమర్శిచారు.
తప్పుడు ప్రచారంతో ప్రజలకు బస్తీ దవాఖాన్లపై అపనమ్మకం, భయం కలిగించి వారిని ఆ హాస్పిటళ్లకు రాకుండా చేస్తే ఎవరికి ప్రయోజనమో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. తమ ప్రభుత్వం త్వరలోనే సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభించబోతోందని, సనత్‌నగర్, అల్వాల్, కొత్తపేట్‌లో అత్యాధునిక వసతులు ఉన్న హాస్పిటళ్లను ప్రజలకు అందించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. మరోవైపు దశాబ్దాల ఉస్మానియా హాస్పిటల్ కలను నేరవేరుస్తున్నాం. సుమారు 2700 కోట్ల వ్యయంతో అద్భుతమైన హాస్పిటల్‌ను నిర్మిస్తున్నామని, ఆరోగ్యశ్రీ ద్వారా వేల కోట్ల విలువైన వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నామని శ్రీ గణేష్తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్లకు నెలకు సగటున 57 కోట్లు ఇస్తే, తాము ఈరోజు నెలకు వంద కోట్లు చెల్లిస్తున్నామని ఆయన చెప్పారు. హాస్పిటళ్ల సంఖ్య పెంచినం.. ప్రొసీజర్ల సంఖ్య పెంచినం.. 5 లక్షల లిమిట్‌ను 10 లక్షలు చేసినం.. గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లకు పునర్వైభవం తీసుకొచ్చే పనిలో మేము ఉంటే, ప్రభుత్వ హాస్పిటళ్లను బదనాం చేస్తూ, శవాల మీద పేలాలు ఏరుకునే పనిలో వారున్నారని శ్రీ గణేష్ఆగ్రహాం వ్యక్తం చేశారు.
జిల్లాకో నిమ్స్ హాస్పిటల్ కడుతామని 2014 మేనిఫెస్టోలో పెట్టారని, ఏ జిల్లాలో నిమ్స్ వంటి హాస్పిటల్ కట్టారో చూపించాలని ఆయన డిమాండ్‌చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడంతో 2022 ఏప్రిల్‌లో అప్పటి సీఎం హడావుడిగా సనత్‌నగర్, అల్వాల్, కొత్తపేట టిమ్స్‌లకు శంకుస్థాపన చేశారని, హాస్పిటళ్ల పేరుతో భూములు బ్యాంకులకు తాకట్టు పెట్టి అడ్డగోలుగా అప్పులు చేశారని శ్రీగణేష్ఆరోపించారు. టిమ్స్‌లు మేమే ప్రారంభించామని, 90 శాతం పనులు పూర్తి చేశాం అంటూ కేటీఆర్ నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పారని, వారి అబద్దాలకు గోబెల్స్ కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉంటుందని ఆయన విమర్శించారు. రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలే బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుతారని శ్రీ గణేష్విమర్శించారు.






