కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకింగ్ రియాక్షన్.. కేటీఆర్‌కు సంచలన సవాల్

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు.

కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకింగ్ రియాక్షన్.. కేటీఆర్‌కు సంచలన సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. తండ్రి కేసీఆర్‌(KCR)కు కవిత రాసిన లేఖ రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఇవాళ ఆమె మరోసారి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతం కోసమే లేఖ రాశానని, అవసరమైతే వంద లేఖలు రాస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌లో కొందరు కోవర్టులున్నారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తనకు కేసీఆర్ ఒక్కడే బాస్ అని.. పార్టీలో మరెవరూ తనకు బాస్ కాదని హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా కవిత వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(Beerla Ilaiah) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత వ్యాఖ్యలతో కవిత అసలు రంగు బయటపడిందని విమర్శించారు. బీఆర్ఎస్‌ను బీజేపీ(BJP)లో కలపాలని చూసినట్లు స్పష్టమవుతోందని అన్నారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న ముసుగు తొలగిపోయిందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది సీట్లు రావడానికి బీఆర్ఎస్సే కారణమని అన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఏకం అయ్యాయని ఆరోపించారు. కేటీఆర్‌కు దమ్ముంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.




Next Story