- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజీవ్ గాంధీ నన్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నాడు: వీహెచ్
కొత్తగా పార్టీలోకి రాగానే వాళ్లకు పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ పీసీసీ చీఫ్వీ.హనుమంత రావు అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. పదవులన్నీ ఒరిజినల్ కాంగ్రెస్‌పార్టీ వాళ్లకే ఇవ్వాలన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా పార్టీలోకి రాగానే వాళ్లకు పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ పీసీసీ చీఫ్వీ.హనుమంత రావు అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. పదవులన్నీ ఒరిజినల్ కాంగ్రెస్‌పార్టీ వాళ్లకే ఇవ్వాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్హవా నడుస్తుందని, చేరికలు పెరిగే ఛాన్స్ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నోళ్లను కాదని, కొత్తోళ్లకు అవకాశం ఇవ్వడం వలన కూడా పార్టీ డ్యామేజ్అయ్యే ప్రమాదం ఉన్నదన్నారు. దీంతో పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని వీహెచ్ తెలిపారు. రేవంత్‌తో పాటు హై కమాండ్‌ను కూడా కోరతానని తెలిపారు. గతంలో రాజీవ్ గాంధీ తనను ముఖ్యమంత్రి చేయాలని అనుకున్నాడని, కానీ బ్యాడ్ లక్వలనే కాలేకపోయాయని వీహెచ్అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్హవా నడుస్తుందని, పార్టీ కార్యకర్తలకు, లీడర్లకు మంచి రోజులు రాబోతున్నాయని వీహెచ్ఆశాభవం వ్యక్తం చేశారు.






