EWS రిజర్వేషన్లకు మేము అడ్డుపడ్డామా..? బీసీ రిజర్వేషన్లపై వీ.హెచ్ భావోద్వేగం

by Ramesh Naini |

బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్‌ సీనియర్ నేత వి.హనుమంతరావు భావోద్వేగం అయ్యారు.

EWS రిజర్వేషన్లకు మేము అడ్డుపడ్డామా..? బీసీ రిజర్వేషన్లపై వీ.హెచ్ భావోద్వేగం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల (BC reservations) అంశంపై కాంగ్రెస్‌ సీనియర్ నేత వి.హనుమంతరావు (V. Hanumantha Rao) భావోద్వేగం అయ్యారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. EWS కోసం 8 శాతం రిజర్వేషన్లు పెడితే మేము అడ్డుపడ్డామా? అని ప్రశ్నించారు. మేము ఒక్క కోర్టుకు సైతం పోలేదని, ఎందుకంటే అందులో కూడా పేద వారు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఓబీసీ అని చెప్పుకునే వాళ్ల చిత్తశుద్ధి ఇదేనా? అని నిలదీశారు.

నేడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అగ్రకులానికి చెందిన వారైనా బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతున్నారని అన్నారు. బీసీలకు ఇప్పుడు 42% రిజర్వేషన్లు రాకపోతే జీవితంలో ఇంకెప్పుడూ రావు అని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై ఓబీసీ ప్రధాని ఓ అడుగు ముందుకు వేయాలని వీహెచ్‌ కోరారు. షెడ్యూల్‌ 9లో చేర్చి బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Next Story